ఔరంగ‌జేబు స‌మాధి వివాదం..నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ 1 y ago

featured-image

 మహారాష్ట్రలోని శంభాజీ నగర్ లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్నాయి. నాగ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు దుండగులు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో దాదాపపు 20 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నాగ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD